Sun Mar 22 2026 13:55:09 GMT+0530 (India Standard Time)
అనకాపల్లిలో టెన్షన్... మాజీ మంత్రి ఇంటికి చేరుకున్న పోలీసులు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దాదాపు రెండు వందల మంది పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అనకాపల్లిలోని వెన్నెలపాలెం గ్రామంలోని పరవాడలో బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
రోజాపై చేసిన వ్యాఖ్యలకు...
మంత్రి ఆర్కే రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యల దృష్ట్యా బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేయడానికే వచ్చారని తెలుస్తోంది. రాత్రి పది గంటల నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరూ రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ నేతను అరెస్ట్ చేయవద్దంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అయితే బండారు సత్యనారాయణమూర్తికి 41ఎ నోటీసులు ఇచ్చి సరిపెడతాారా? అరెస్ట్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

