Sat Dec 13 2025 19:30:43 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాల జిల్లాకు మావోలు
నంద్యాల జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు

నంద్యాల జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కూంబింగ్ చేపట్టారు. కొలిమిగుండ్ల మండలం ఎర్రమల కొండ ప్రాంతం లో మావోయిస్టులు సంచరిస్తూన్నారని కలకలం రేగింది. నేల బిళo, ఓబులేసు కోన, ఎర్రకోన ప్రాంతాల్లో చత్తీస్ గడ్ ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు. పలు సిమెంట్ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్న ఒరిస్సా ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ కార్మికులుగా ఉన్నారని అనుమానిస్తున్నారు.
పోలీసుల కూంబింగ్...
కొలిమిగుండ్ల ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా భావించి ఉండ వచ్చననే అనుమానం తో పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 మందికి పైగా రెండు ప్రతేక వాహనాల్లో వచ్చిన చత్తీస్ గఢ్ పోలీసులు బృందాలు కూంబింగ్ ను చేపట్టాయి. బెలుం పరిసర ప్రాంతాల్లో 10 ఏళ్ల క్రితం జనశక్తి నక్సల్స్ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ వ్యవహారం స్థానికం గా చర్చనీయాంశం గా మారింది.
Next Story

