Thu Feb 12 2026 11:33:15 GMT+0530 (India Standard Time)
Pinnelli : పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ నమోదు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆయనతో పాటు సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కూడా రౌడీషీట్ తెరిచారు. వీరిద్దరితో పాటు నియోజకవర్గంలో మొత్తం 150 మంది పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో చొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటుగా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి.
ఐదు కేసులతో...
దీంతో ఆయనతో పాటు ఆయన సోదరుడిపై రౌడీషీట్ తెరిచినట్లు పల్నాడు జిల్లా పోలీసులు తెలిపారు. కారంపూడి సీఐ నారాయణస్వామి పై దాడికేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. మొత్తం ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
Next Story

