Sat Apr 11 2026 10:47:46 GMT+0530 (India Standard Time)
కడపలో నిందితుడిపై పోలీసులు కాల్పులు
కడపలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు

కడపలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కడప జిల్లాలోని ఖాజీపేట లోని అగ్రహారం కిందిన కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసిన వెంకటేష్ ను పోలీసులు వేరే ప్రదేశానికి తీసుకెళ్తుండగా పోలీసులపై వెంకటేష్ దాడికి పాల్పడిన నేపథ్యంలో మైదుకూరు బద్వేల్ ప్రధాన రహదారిలోని బసాపురం చెక్ పోస్ట్ వద్ద నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
పోలీసులకు గాయాలు...
ఈ ఘటనలో పోలీసులకు కొందరికి గాయాలైన నేపథ్యంలో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు..ఈ ఘటనపై పూర్తి సమాచారం పోలీసుల వర్గాల నుండి వెల్లడి కావాల్సి ఉంది. నిందితుడి కాళ్లకు కూడా గాయాలు కావడంతో కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Next Story

