Thu Mar 19 2026 11:00:11 GMT+0530 (India Standard Time)
చాపాడు ఘటనపై ఉన్నతాధికారుల ఆగ్రహం
కడప జిల్లా చాపాడు ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు

కడప జిల్లా చాపాడు ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఘటనలపై అధికారుల ఆగ్రహం వ్యక్తంచేశారు. చాపాడు మండలంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి ఘటనలపై మైదుకూరు డీఎస్పీకి ఛార్జ్ మెమో జారీ జారీ చేశారు.
డీఎస్పీకి ఛార్జ్ మెమో...
విధుల్లో నిర్లక్ష్యం వహించిన చాపాడు ఎస్ఐపై శాఖాపరమైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Next Story

