Mon Jan 20 2025 00:34:44 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రి నుంచి జేసీ కుటుంబం హైదరాబాద్ కు
తాడిపత్రి నుంచి హైదరాబాద్ కు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు
తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి నుంచి హైదరాబాద్ కు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య శుక్రవారం హైదరాబాద్ తరలించారు.
ఘర్షణల నేపథ్యంలో...
ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జేసీ నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి తాడి పత్రిలో ఉంటే సమస్యలు మరింత ఎక్కువావుతాయని భావించిన పోలీసులు ఆయనను హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. తాడిపత్రి వదిలి వెళ్లాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు అనారో గ్యంతో ఉన్నారని దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ పోలీ సులు బందోబస్తు మధ్య హైదరాబాద్ కు జేసీ కుటుంబ సభ్యులను తరలించారు
Next Story