Thu Jan 16 2025 22:14:12 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ నిషిద్ధ ప్రాంతమా?
విశాఖపట్నంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు వెళ్లకుండా అడ్డుకున్నారు
విశాఖపట్నంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు రుషికొండకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ తవ్వకాలను పరిశీలించాలని నిర్ణయించారు. అయితే జీవీఎల్ నరసింహారావును పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు పోలీసుల తీరుపై మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడ ఏం జరుగుతుంది....?
రుషికొండకు తమను ఎందుకు వెళ్లనివ్వడం లేదని, అక్కడ రహస్యం ఏం ఉందని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. పాత హోటల్ ఎంత పరిధిలో ఉందో ఆ మేరకే నిర్మాణం చేపట్టాలని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయని అన్నారు. రుషికొండ మొత్తాన్ని తొలిచేసినట్లు తమకు అనుమానం కలుగుతుందని జీవీఎల్ నరసింహారావు సందేహం వ్యక్తం చేశారు. అందుకే తమను వెళ్లనివ్వకండా అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. రుషికొండలో ఏం జరుగుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
Next Story