Thu Jan 29 2026 09:11:35 GMT+0000 (Coordinated Universal Time)
నాగబాబు పర్యటనపై ఆంక్షలు
అనంతపురంలో నాగబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారులపై శ్రమదానానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు

అనంతపురంలో నాగబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారులపై శ్రమదానానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పర్యటనను వాయిదా వేసుకోవాలని నాగబాబుకు పోలీసులు సూచించారు. నాగబాబు పర్యటనతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు చెబుతున్నారు.
రోడ్లపై గుంతలు పూడ్చే...
రోడ్లపై గుంతలు పూడ్చే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పర్యటనకు అనుమతివ్వలేదు. తాము మాత్రం శ్రమదానం చేసి తీరుతామని జనసేన నేతలు చెబుతున్నారు.
Next Story

