Wed Mar 11 2026 09:56:19 GMT+0530 (India Standard Time)
బస్సు సీట్ల కింద 4.76 కోట్ల నగదు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రయివేటు బస్సులో నాలుగు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రయివేటు బస్సులో నాలుగు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రావెల్స్ బస్సులో లగేజీ డిక్కీలు, సీట్ల కింద దాచి ఉంచి నగదు, బంగారాన్ని రవాణా చేస్తున్నారు. పద్మావతి ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు శ్రీకాకుళం నుంచి గుంటూరు కు వెళుతుంది.
గుంటూరుకు తరలిస్తుండగా....
సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులకు పెద్దయెత్తున నగదు పట్టుబడింది. మొత్తం 4.76 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
Next Story

