Sat Jan 31 2026 16:20:16 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి బంగారుపాళ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి బంగారుపాళ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నారా లోకేష్ తో పాటు పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి, సీనియర్ నేత పులివర్తి నాని, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలపై కేసులను నమోదు చేశారు.
బంగారుపాళ్యంలో...
నిన్న బంగారుపాళ్యంలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో మైకుకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. బహిరంగ సభను కూడా నిర్వహించడానికి వీలు లేదని చెప్పారు. దీంతో పోలీసులపై కొందరు కార్యకర్తలు తిరగబడ్డారు. అంతేకాకుండా ఒక డాబా ఎక్కి లోకేష్ ప్రసంగించడంతో ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులను తోసిన ఘటనలో వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
Next Story

