Sun Jan 12 2025 21:39:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జగన్ పై దాడి ఘటన పై కేసు నమోదు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై నిన్న జరిగిన రాళ్లదాడిపై పోలీసులు కేసు నమోదు చేసింది
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై నిన్న జరిగిన రాళ్లదాడిపై పోలీసులు కేసు నమోదు చేసింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాడి ఘటనపై అజిత్సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెల్లంపల్లి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏ ఏ సెక్షన్ల కింద....
అయితే ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నది బయటకు చెప్పడం లేదు. నిన్న రాత్రి సింగ్ నగర్ లో వైఎస్ జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ నుదుటికి గాయం కావడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈరోజు జగన్ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు సాయంత్రం వైద్యులు పరీక్షించిన అనంతరం బస్సు యాత్ర కొనసాగడంపై స్పష్టత వస్తుంది.
Next Story