Fri Jan 17 2025 07:43:00 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు
వైసీపీ ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఉపయోగించే ఎగ్జామ్ ప్యాడ్లపై తన ఫొటోలను ముద్రించి ఇవ్వడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిని ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్లవుతుందని పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటేశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా...
అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విద్యార్థులకు ప్యాడ్లను ఇవ్వడమే కాకుండా, దానిపై తన ఫొటోను ముద్రించి ఇవ్వడం కూడా వి.కోట పోలీసులు తప్పుపట్టారు. పరీక్ష కేంద్రంలో ఈ ప్యాడ్లను గమనించిన ఇన్విజిలేటర్లు ఆర్డీవోకు సమాచారం ఇవ్వడంతో ఆయన సూచన మేరకు వి. కోట పోలీసులు వెంకటేశ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.
Next Story