Sun Mar 15 2026 20:37:41 GMT+0530 (India Standard Time)
కందుకూరు ఘటనపై కేసు నమోదు
కందుకూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు కేసు నమోదు చేశారు

నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
174 సెక్షన్ కింద...
174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకున్న చోట సభను ఏర్పాటు చేయకపోవడం, నిర్వాహకులు ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే మృతుల సంఖ్య ఇంత పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story

