Sun Mar 15 2026 08:53:43 GMT+0530 (India Standard Time)
చింతమనేని పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఉన్న తన అనుచరుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారన్న దానిపై చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. నిందితుడిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు అతని అనుచరులపైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
దౌర్జన్యంగా తీసుకెళ్లారని...
ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో కత్తితో దాడి చేసిన టీడీపీ కార్యకర్త రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విడిపించేందుకు స్టేషన్ కు రావడమే కాకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లారని చింతమనేని పై కేసు నమోదయింది. స్టేషన్ లో ఉన్న నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఆయనపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Next Story

