Sun Mar 15 2026 12:45:06 GMT+0530 (India Standard Time)
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 120 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమలులు ఉన్నప్పటికీ అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా...
టీడీపీ కౌన్సిలర్ పై దాడిని నిరసిస్తూ నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. డీఎస్పీ, తాడిపత్రి ఎమ్మెల్యే వైఖరి తీరుకు నిరసనగా ఆయన ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడమే కాకుండా, అనుమతి లేకుండా ఆందోళనకు దిగడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోద చేశారని చెప్పారు.
Next Story

