Fri Dec 05 2025 15:54:13 GMT+0000 (Coordinated Universal Time)
Posani Krishana Murali : పోసాని ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదుగా
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో పథ్నాలుగు కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకదాని తర్వాత మరొక కేసు పోసాని మెడకు చుట్టుకుంటుంది.
నాడు చేసిన కామెంట్స్...
గత వైసీపీ అధికారంలో ఉన్నప్పడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ నేడు ఆయన పాలిట శాపంగా పరిణమించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో పాటు వారి కుటుంబసభ్యులను దూషించిన కేసులు వరసగా నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసినా నాడు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరస కేసులు పోలీసులు నమోదవుతున్నాయి. దీంతో పోసాని కృష్ణమురళిని ఏపీ అంతటా తిప్పుతూ జైళ్లను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వరస కేసులు...
ఇప్పటికే పథ్నాలుగు నుంచి పదిహేడు కేసులు నమోదయ్యాయి. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం పీటీ వారెంట్ పై నరసరావుపేటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరొకచోటకు.. ఇలా ఏపీ అంతా ఆయనపై కేసులు నమోదు కావడంతో దాదాపు అన్ని సబ్ జైళ్లను చూపించే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరొక కేసు రెడీగా ఉండటంతో ఆయన నాలుగు గోడల మధ్య నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. మొత్తం మీద పోసాని ఏపీ టూర్ వేయక తప్పదన్న సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
Next Story

