Mon Feb 02 2026 04:46:23 GMT+0000 (Coordinated Universal Time)
ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై కేసు నమోదయింది

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై కేసు నమోదయింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో ఆదినారాయణరెడ్డిపై కేసును పోలీసులు నమోదు చేశారు. నిన్న అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సమయంలో ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వాహనాలపై దాడులు...
దీంతో పాటు వైసీపీ నేతలు ఆదినారాయణరెడ్డి అనుచరులు తమ వాహనాలపై దాడులు చేశారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. నిన్న బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై దాడి చేసిన వారిని పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే ఆదినారాయణ రెడ్డి అనుచరులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు.
Next Story

