Tue Mar 24 2026 01:55:05 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఇటీవల శ్రీరామ నవమి వేడుక సందర్భంగా జరిగిన ర్యాలీలో చేసిన ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉండటంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి రోజు హైదరాబాద్ నగరంలో ఏటా శోభాయాత్రను నిర్వహిస్తారు.
శోభాయాత్రలో...
ఈ శోభాయాత్రను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలోనే నిర్వహిస్తారు. అయితే కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేశారంటూ రాజాసింగ్ పై ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

