Wed Jan 28 2026 13:22:56 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు
అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఆర్ఐ అధికారులను అడ్డుకున్నందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లిలో ఒక వ్యాపారి ఇంట్లో జీఎస్టీ తనిఖీల కోసం డీఆర్ఐ అధికారులు వెళ్లగా సీఎం రమేష్ వారిని అడ్డుకున్నారని ఫిర్యాదు అందింది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు.
అధికారులను అడ్డుకున్నారని...
వాళ్లను అడ్డుకోవడమే కాకుండా అధికారుల చేతుల్లో ఫైళ్లను లాక్కునేందుకు సీఎం రమేష్ ప్రయత్నించారని, అందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చోడవరం పోలీసులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నందుకు ఆయనపై ఐపీసీ 143, 506, 342, 353, 201, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story

