Mon Mar 23 2026 02:08:43 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ దువ్వాడ పై పోలీసు కేసు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుతో ఆయనపై శ్రీకాకుళం జిల్లా హిర మండలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దువ్వాడ శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ పై...
నెలకు యాభై కోట్ల రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు నుంచి తీసుకుంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించడం మానేశారంటూ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన హీర పోలీసులు ఆయన నివాసంలో నోటీసులు అందచేశారు. ఆయనను విచారించనున్నారు.
Next Story

