Wed Jan 28 2026 21:04:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : టెన్షన్ మధ్య రేపు జగన్ నెల్లూరు పర్యటన
రేపు నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు.

రేపు నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. హెలిప్యాడ్ వద్ద పదిమందికి మాత్రమే అనుమతించారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు తమకు అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రన్నకుమార్ రెడ్డి ఇంటివద్దకు జగన్ తో పాటు పదిహేను మందికి మాత్రమే అనుమతిచ్చారు.
పోలీసుల ఆంక్షలతో...
జగన్ తొలుత జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. జైలు వద్దకు జగన్ తో పాటు ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా తాము వైసీపీ కార్యకర్తలను అదుపు చేయలేమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ నెల్లూరు పర్యటన టెన్షన్ మధ్య కొనసాగే అవకాశముంది.
Next Story

