Sun Mar 15 2026 12:48:10 GMT+0530 (India Standard Time)
మాచర్లలో పోలీసుల హై అలెర్ట్
మాచర్లలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే మాచర్లలో 144వ సెక్షన్ కొనసాగుతుంది

మాచర్లలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే మాచర్లలో 144వ సెక్షన్ కొనసాగుతుంది. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి అతని అనుచరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వారు నేడు మాచర్లకు వస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టేందుకు వాళ్లు నేడు రానున్నారు.
ఘర్షణలు జరగొచ్చని...
ఈ నేపథ్యంలో మళ్లీ ఘర్షణలు జరుగుతాయని భావించి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ మాచర్లలో అమలులో ఉందని, ఎలాంటి ఘర్షణలకు పాల్పడినా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాచర్ల ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

