Wed Jan 21 2026 03:32:12 GMT+0000 (Coordinated Universal Time)
Macherla : రాత్రికి మళ్లీ దాడులు జరిగే అవకాశం.. అలెర్ట్ అయిన పోలీసులు
ఈరోజు రాత్రి మాచర్లలో దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసుల అలెర్ట్ అయ్యారు

ఈరోజు రాత్రి మాచర్లలో దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసుల అలెర్ట్ అయ్యారు. దీంతో పోలీసులు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మాచర్లతో పాటు పల్నాడు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్షిస్తున్నారు. వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలన్నీ మూసివేశారు. రెండు రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
భారీగా మొహరింపు...
మళ్లీ ఘర్షణలు జరుగుతాయని భావించడంతో పెద్దయెత్తున పోలీసులు భారీగా మొహరించారు. పారామిలటరీ బలగాలను పల్నాడుకు తరలించారు మాచర్ల, గ్రామల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపారు. పల్నాడు జిల్లా ఎస్పీ మాచర్లలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

