Sat Mar 07 2026 16:35:54 GMT+0530 (India Standard Time)
రేపు పోలీసుల ఎదుటకు జోగి రమేష్
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో రేపు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు రావాలని నోటీసులు జారీ చేయడంతో జోగి రమేష్ రేపు మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది.
చంద్రబాబుపై దాడి కేసులో...
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారంటూ ఆయనపై కేసు నమోదయింది. దీంతో పోలీసులు ఆయనను పలుమార్లు విచారించారు. అయితే తిరిగి మరోసారి విచారణకు పిలవడంతో జోగి రమేష్ నుంచి ఏరకమైన సమాధానాలను రాబట్టడానికి రమ్మన్నారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
Next Story

