Fri Dec 05 2025 17:52:26 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నానికి పోలీసులు షాక్
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు.

మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంపారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
అమెరికా వెళుతున్నారన్న...
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడాలి నాని ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన తర్వాత వైద్యం కోసం అమెరికా వెళతారన్న పెద్దయెత్తున ప్రచారం జరుగుతుండటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆన్ లైన్ ద్వారా కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.
Next Story

