Sat Mar 07 2026 10:49:30 GMT+0530 (India Standard Time)
YS Jagan Selfi: వైఎస్ జగన్ తో సెల్ఫీ దిగారు.. చిక్కుల్లో పడ్డారు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లా కారాగారంలోకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేశ్,

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లా కారాగారంలోకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. జైల్లో వారిని పరామర్శించి ఆయన బయటకు వచ్చిన సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ జగన్ వద్దకు వచ్చి సెల్ఫీలు దిగారు. ఆమె తన కూతురుతో కలిసి జగన్ వద్దకు వచ్చారు. జగన్ వారితో కలచాలనం చేసి సెల్ఫీ దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను తన కుమార్తెతో కలిసి వచ్చి జగన్తో సెల్ఫీలు దిగారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో ఉన్న పోలీసు ఇలా సెల్ఫీలు దిగడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నతాధికారులు యాక్షన్ లోకి దిగారు.
Next Story

