Tue Jan 20 2026 15:38:07 GMT+0000 (Coordinated Universal Time)
చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు
హైదరాబాద్ లోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ లోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో అక్కడే ఉండి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. సర్వెంట్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు విజ్ కోసం ఎందుకు వచ్చారో తమకు తెలియదని సర్వెంట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. పనిమనుషులకు నోటీసులు అందజేశారు.
దొంగల్లా రావడమేంటి?
అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలతో చింతకాయల విజయ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. చింతకాయల విజయ్ ఐటీడీపీ కో కన్వీనర్ గా పనిచేస్తున్నారు. చింతకాయల్ విజయ్ ఇంటికి పోలీసులు రావడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు పట్టారు. దొంగల్లా పోలీసులు వచ్చి భయభ్రాంతులకు గురి చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను పోలీసుల చర్యలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు.
Next Story

