Thu Mar 19 2026 05:26:53 GMT+0530 (India Standard Time)
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదయింది. గుంటూరు పట్టణ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు


మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదయింది. గుంటూరు పట్టణ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు అంబటి రాంబాబు పై కేసు నమోదుచేశారు.రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు తన అనుచరులతో కలసి వెళ్లారు.
పోలీస్ స్టేషన్ లో ధర్నాకు...
జగన్ పైనా, తమ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం తమ నుంచి ఫిర్యాదులు కూడా తీసుకోలేదని ఆయన పోలీస్ స్టేషన్ లో కాసేపు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

