Sun Mar 22 2026 17:01:40 GMT+0530 (India Standard Time)
కందుకూరు ఘటన : టీడీపీ నేత అరెస్ట్
కందుకూరు ఘటనలో టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

కందుకూరు ఘటనలో టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద కొద్దిసేపటి క్రితం పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.
తొక్కిసలాటపై...
అయితే ఇరుకు సందులో సభను నిర్వహించడం, రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టి రోడ్డును మరింత కుచించుకుపోయేలా చేయడం వంటి కారణాలపై ఇంటూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయనను ఇదే కేసులో అరెస్ట్ చేశారా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. ఇంటూరి అరెస్ట్‌కు నిరసనగా కందుకూరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Next Story

