Tue Mar 24 2026 09:46:20 GMT+0530 (India Standard Time)
విజయవాడలో ఉగ్రవాదలింకులున్న ముగ్గురు అరెస్ట్
విజయవాడలో ఉగ్రవాదులతో లింకులున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

విజయవాడలో ఉగ్రవాదులతో లింకులున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు మద్దతు పలుకుతున్నట్లు తేలింది. మహ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహ్మద్ డానిష్ లు వించిపేటలో నివాసం ఉంటూ ఉగ్రవాద లింకులున్నాయని ఇంటలిజెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పాకిస్థాన్ లోని...
పాకిస్థాన్ లోని కొందరు ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరి ముగ్గురికి ఒక ప్రార్థనాలయంలో పరిచయం ఏర్పడి అది ఉగ్రవాదం వైపు మళ్లించేలా చేసిందని అధికారుల చెబుతున్నారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఉగ్రవవాద భావాజాలాన్ని యువతలో మరింతగా పెంపొందించి వారిని అటు వైపు మళ్లించే ప్రయత్నాలు వీరు చేస్తున్నారు. రిక్రూట్ మెంట్, జీహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను వీరికి పాకిస్తాన్ నుంచి సమకూరినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
Next Story

