Fri Dec 05 2025 13:38:44 GMT+0000 (Coordinated Universal Time)
రెండోరోజు పోలీస్ కస్టడీకి కాకాణి
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. నిన్నటి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. నెల్లూరుకు చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి గత కొద్ది రోజులుగా మైనింగ్ కేసులో జైలులో ఉన్నారు. అయితే ఆయనను మైనింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో న్యాయస్థానం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి విచారణకు అనుమతి ఇచ్చింది.
ఈరోజు కూడా...
కృష్ణపట్నం పోర్టు పోలీస్స్టేషన్లో కాకాణిని డీఎస్పీ శ్రీనివాసరావు విచారిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిని నిన్న విచారించగా పోలీసులు అడిగిన 22 ప్రశ్నలకు రెండింటికి మాత్రమే సమాధానం చెప్పారని తెలిసింది. ఈరోజు మరికొన్ని ప్రశ్నలతో కాకాణి గోవర్థన్ రెడ్డిని విచారించనున్నారు.
Next Story

