Fri Dec 19 2025 02:24:15 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో అరెస్ట్ లు.. బాబు వెళ్లిన వెంటనే?
కుప్పం నియోజకవర్గంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ లు చేస్తున్నారు

కుప్పం నియోజకవర్గంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ లు చేస్తున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన ముగించుకుని వెళ్లగానే అరెస్ట్ లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పీఎస్ మణితో పాటు కుప్పం మున్సిపాలిటి కౌన్సిలర్ జాకీర్ ను కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న యాభై మంది మీద కేసులు నమోదు చేశారు.
బాబు పర్యటన సందర్భంగా....
కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. అన్నా క్యాంటిన్ ధ్వంసం అయిన ఘటనలో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. అక్రమ అరెస్ట్ లను చంద్రబాబు నాయుడు ఖండించారు.
Next Story

