Mon Mar 16 2026 04:25:55 GMT+0530 (India Standard Time)
హెలికాప్టర్ లో మోదీ వెంట జగన్
ప్రధాని మోదీ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు

ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. పుష్పగచ్ఛం సమర్పించి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీతో కలసి హెలికాప్టర్ లో బయలు దేరి వెళ్లారు. మరికాసేపట్లో మోదీ భీమవరానికి చేరుకున్నారు.
వెనక్కు పంపుతూ...
కాగా బహిరంగ సభ కు వేలాది సంఖ్యలో జనం తరలి వచ్చారు. పోలీసులను తోసుకుని జనం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అంచనాకు మించి జనం రావడంతో ప్రజలను పోలీసులను వెనక్కు పంపుతున్నారు. వెనక్కు వెళ్లి పోవాలంటూ పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. ప్రధాని మోదీ భీమవరం పట్టణంలో మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఉంటారు. దీంతో భీమవరం పట్టణం కోలాహలంగా మారింది.
Next Story

