Sat Dec 13 2025 19:30:29 GMT+0000 (Coordinated Universal Time)
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడానికి అనేక కారణాలున్నాయి

ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు నిధులు ఇస్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు వేల రూపాయలు అందచేస్తుంది. మొత్తం ఏడాదికి మూడు విడతలుగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇటీవల పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ అయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు, ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అందించింది. తెలంగాణలోనూ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల నగదు జమ అయింది.
డబ్బులు పడకపోవడానికి...
అయితే పీఎంకిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని నివారిస్తే పీఎం కిసాన్ డబ్బులు అందుతాయని, డబ్బులు పడని వారు ఈ కింది విధంగా చేయాలని అధికారులు కోరారు. పీఎం కిసాన్ కింద నిదులు ఈకేవేసీ పూర్తి చేయకపోవడం వలన డబ్బులు జమకావు. వెంటనే ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆ సౌలభ్యం మీసేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ కు మాత్రమే ఇచ్చారు. రైతు ఈకేవైసీ పూర్తి చేసుకున్న 30 నుంచి 60 రోజులలో వారికి NPCI లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
పట్టాదారు పాస్ బుక్
అలాగే రైతు ఆధార్ కి పట్టాదారు పాస్ బుక్ లింక్ లేకపోవడం వలన డబ్బులు పడవు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర పట్టాదార్ పాసుబుక్ కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ థంబ్ లేదా ఓటీపీ తో లింక్ అభ్యర్థన ను తహసీల్దార్ వారి కార్యాలయం వారికీ పంపిస్తారు. అక్కడ పూర్తి అయిన తరువాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది ని కలిసి పూర్తి చేసిన విషయం తెలియచేస్తే మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలు పంపిస్తారు. ఇక రైతు బ్యాంక్ ఖాతా ఆధార్ తో అనుసంధానం కాక పోవడం వలన డబ్బులు పడవు. రైతు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్ వద్దకి వెళ్లి ఎన్.పి.సీ.ఐ లింక్ చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఎన్.పి.సీ.ఐకి లింక్ అవుతుంది.
ఎన్.పి.సీ.ఐ లింక్ అయిన...
రైతుకి ఎన్.పి.సీ.ఐ లింక్ అయినప్పటి నుండి 30 నుండి 90 రోజుల వ్యవధి లో వారికీ ఆగిన నగదు జమ అవుతుంది. 2019 ఫిబ్రవరి నెల తరువాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పధకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు. భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పధకం ద్వారా లబ్ది పొందుతూ మరణిస్తే వారి నామిని పొలం మార్చుకొని అప్లై చేసుకొంటే వారు అర్హులుగా గుర్తిస్తారు. ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన కొందరికి నగదు జమ కాలేదు. వారి వివరాలు అనుమానస్పద ఉన్నాయని గుర్తించి అనగా ఒకే కుటుంబం లో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అనే అనుమానం వలన వారికి ప్రస్తుతం నగదు నిలిపి వేశారు. వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వారికీ కూడా నగదు జమ కానున్నాయి.
అనర్హులు ఎవరంటే?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షన్ దారులు.
ఆదాయ పన్ను చెల్లించే వారు.
రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారు.
Next Story

