Sat Mar 14 2026 21:05:23 GMT+0530 (India Standard Time)
Breaking : పవన్ కు పోలీసు నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏ ఆధారంతో ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలంటూ పవన్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన సభలో రాళ్లతో దాడి చేస్తారని, ఇందుకోసం రౌడీషీటర్లను కూడా అధికార వైసీపీ ఇప్పటికే దించిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పెడన సభలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎస్పీ, డీజీపీలు దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు.
పెడనలో జరగనున్న...
దీనిపై కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. పెడనలో దాడులు జరుగుతాయన్న ఆరోపణలకు మీ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని పవన్ ను నోటీసుల్లో కోరారు. మరికాసేపట్లో పెడనలో సభ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరుగుతాయోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కు పోలీసులు నోటీసులు జారీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులు అంటున్నారు. బాధ్యతారహిత్యంగా ఆరోపణలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని
Next Story

