Thu Dec 11 2025 08:27:13 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Pinnelli : కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సరెండర్ పిటీషన్ పిన్నెల్లి తరుపున న్యాయవాదులు కోర్టులో వేశారు. పిన్నెల్లి సోదరులు లొంగిపోయిన నేపథ్యంలో మాచర్ల న్యాయస్థానం ఎదుట భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాచర్లలో 144 సెక్షన్
మాచర్లలో 144 సెక్షన్ ను విధించారు. కోర్టులో న్యాయమూర్తి తదుపరి ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లి సోదరులు చర్యలు తీసుకుంటున్నారు. న్యాయస్థానం పక్కనే ఉన్న ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పిన్నెల్లి సోదరులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని జైలుకు తరలించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

