Wed Mar 18 2026 19:07:32 GMT+0530 (India Standard Time)
Breaking : జంట హత్యల కేసులో పిన్నెల్లికి బెయిల్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ జంట హత్యల కేసులో దాదాపు 98 రోజుల నుంచి నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.
సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాత్రం...
అయితే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి మాత్రం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడంతో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే నేడు, రేపట్లో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
Next Story

