Sat Dec 06 2025 02:12:27 GMT+0000 (Coordinated Universal Time)
వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై హైకోర్టులో పిటీషన్
సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది.

సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని పిటీషనర్ పేర్కొన్నారు. ఇటీవల న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటీషన్ లో ప్రస్తావించారు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు.
సస్పెండ్ చేయాలి...
రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఒక ప్రభుత్వోద్యోగిగా ఆయన చేసిన వ్యాఖ్యలు విరుద్ధమని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలను చేసినందుకు వెంకట్రామిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వం సస్సెండ్ చేసి ఉండాల్సిందని శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అలా చేయకపోవడం దురదృష్టకరమని అని ఆయన అన్నారు. న్యాయవాదులందరూ ఈ వ్యాఖ్యలను ఖండించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

