Thu Jan 29 2026 12:50:32 GMT+0000 (Coordinated Universal Time)
High Court : నేడు గంటా రాజీనామా ఆమోదంపై విచారణ
టీడీపీ ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ ఆమోదించడంపై వేసిన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది

టీడీపీ ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ ఆమోదించడంపై వేసిన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా తన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ఫార్మాట్ లో లేఖను పంపారు.
రాజ్యసభ ఎన్నికల్లో...
అయితే మూడేళ్ల క్రితం తన రాజీనామాను ఆమోదించడమేంటని గంటా శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని గంటా శ్రీనివాసరావు తన పిటీషన్ లో కోరారు.
Next Story

