Sat Mar 28 2026 00:00:38 GMT+0530 (India Standard Time)
పవన్ వల్ల నష్టమూ లేదు... లాభమూ లేదు
పవన్ కల్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన హాబీగా మాత్రమే రాజకీయాలు చేస్తారన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన హాబీగా మాత్రమే రాజకీయాలు చేస్తారన్నారు. పవన్ ఎప్పుడూ మాట మీద నిలబడింది లేదన్నారు. ప్రతి ఎన్నికకకు ఒక పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్లుందని చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ కేరాఫ్ అడ్రస్ అని పేర్ని నాని అన్నారు.
మాటలు మార్చడం...
పవన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పవన్ లా మాట మార్చే వారిని ప్రజలు చెప్పుతో కొడతారని పేర్ని నాని అన్నారు. చెగువేరా, పూలే అందరూ అయిపోయారని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నారని పేర్ని నాని అన్నారు. పల్లకి మోయడమే పవన్ కల్యాణ్ పని అని, ఆయన వల్ల ఎవరికీ రాజకీయ ప్రయోజనం, నష్టం ఉండదని పేర్ని నాని అన్నారు.
Next Story

