Sat Dec 06 2025 19:49:44 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సమావేశానికి ఎవరెవరు వస్తారో?
పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే సినిమా రంగం నుంచి ఎవరెవరు వస్తారన్నది రేపు ఉదయం తెలుస్తుందని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు గాని, మధ్యాహ్నం మూడు గంటలకు గాని సినీ ప్రముఖులు భేటీ అవుతారని పేర్ని నాని తెలిపారు. ప్రధానంగా సినిమా టిక్కెట్ల ధరలపై చర్చిస్తారా? లేదా ఇతర సినిమారంగ సమస్యలపై చర్చిస్తారా? అన్నది తెలియదని, వారి అజెండా తమకు ఇంకా చేరలేదని పేర్ని నాని తెలిపారు.
కరోనా ఆంక్షలతో....
కరోనా ఆంక్షల వల్ల తక్కువ మంది రావాలని తాము వారికి సూచించామని పేర్ని నాని చెప్పారు. సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే టిక్కెట్ల ధరల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్ని నాని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖులు సమావేశం అయిన తర్వాత ఒక కన్ క్లూజన్ కు వచ్చే అవకాశముందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
Next Story

