Fri Dec 05 2025 16:24:36 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : నిమ్మగడ్డ బ్యాచ్ వాలంటీర్లతో అడ్డుకోవాలని చూస్తున్నారు
వాలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు మొదటి నుంచి వారినీ శత్రువులగానే భావిస్తున్నారని పేర్ని నాని అన్నారు.

వాలంటీర్లపై కక్ష కట్టిన టీడీపీ పింఛన్ ను అందించిన వారంటే చంద్రబాబుకు మొదటి నుంచి శత్రువులగానే భావిస్తున్నారని పేర్ని నాని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పింఛన్లు ఆపేందుకు చంద్రబబు ప్రయతించారని అన్నారు. వాలంటీర్లను చూస్తేనే టీడీపీ అండ్ కో కు భయమేస్తుందన్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ అని, దానిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారని, చంద్రబాబుకు లబ్ది చేయాలన్న ఆలోచనతోనే వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారన్నారు.
వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు...
వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు, పవన్, పురంద్రీశ్వరిలు కుట్రలు చేస్తున్నారన్నారు. గతంలో భీమవరంలో ఉంటానని చెప్పిన పవన్ ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటూ ఇప్పుడు డైలాగులు చెబుతున్నారన్నారు. తాను ఎమ్మెల్యే అయితే చాలునని పవన్ అనుకుంటున్నారని, ఈసారి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని వీరందరికీ కడుపు మంట అని అన్నారు. గత ఆరు నెలలుగా బ్లాక్ మెయిల్ రాజకీయాలను చేస్తున్నారన్నారు.
Next Story

