Fri Dec 05 2025 13:29:57 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : పేర్నినానికి జగన్ క్లాస్ పీకారా? కుదరదని చెప్పేశారా?
Jagan reportedly urged former minister Perni Nani to contest in 2029 elections, reversing his earlier stance after his son’s defeat in Machilipatnam.

మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో జగన్ తిరిగి తన నిర్ణయం మార్చుకున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో పేర్ని నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పేర్నినాని పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పేర్ని నానికి బదులు ఆయన కుమారుడు పేర్నిసాయి కృష్ణమూర్తి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2029 ఎన్నికల్లో పేర్ని నానిని పోటీ చేయాలని ఇటీవల పేర్నినానికి గట్టిగా జగన్ చెప్పినట్లు తెలిసింది. పేర్నినాని కొంత తటపటాయించినా వచ్చే ఎన్నికలు కీలకమని, ఈసారి మాత్రం మీరే పోటీ చేయాలంటూ పేర్ని నానిని ఉద్దేశించి కొంత గట్టిగానే చెప్పినట్లు సమాచారం. దీంతో అందుకు పేర్ని నాని కూడా అంగీకరించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి...
పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. ఆయన తదనంతరం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పేర్ని నాని కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పేర్ని నాని విజయం సాధించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. పేర్ని నాని 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పేర్ని నాని వైసీపీ నుంచి గెలిచారు. కొల్లు రవీంద్రను ఓడించారు. తర్వాత పేర్ని నాని జగన్ మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు.
వాగ్దాటి ఉన్న నేతగా...
పేర్నినాని మంచి వాగ్దాటి ఉన్న నేతగా పార్టీలో పేరుపొందారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేర్ని నాని తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారంటారు. ఆయన తన మాటలతో 2024లో తన కుమారుడు మచిలీపట్నంలో ఓటమి పాలయిన తర్వాత రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోయిన పిదప పార్టీకి మౌత్ పీస్ గా తయారయ్యారు. అంశం ఏదైనా పేర్ని నాని మాట్లాడే మాటల్లో ఖచ్చితత్వం ఉంటుందని అంటారు. ఆయన తన వాగ్దాటితో అధికార పక్షంపై విరుచుకుపడతారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తూ పార్టీ క్యాడర్ లో పేరు తెచ్చుకున్నారు. అందుకే జగన్ వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండేదుకు పోటీ చేయాల్సిందేనని ఖచ్చితంగా చెప్పడంతో పేర్ని నాని కూడా అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. సో.. వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయడం కోసమే యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు.
Next Story

