Sun Dec 07 2025 18:04:21 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నేడు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నేడు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65 లక్షల మందికి పైగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
దసరా పండగకు ముందు...
దసరా పండగ అయినప్పటికీ పింఛన్ల పంపిణీ ఆగకూడదని భావించిన రాష్ట్రప్రభుత్వం పింఛన్లకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. వృద్ధులు, వితంతవులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు నెలకు పదిహేను వేల రూపాయలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది.
Next Story

