Fri Dec 05 2025 17:50:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నేడు పింఛన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధులకు, వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరువేల రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ చేయనున్నారు.
వేళల్లో మార్పు...
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల మందికి పింఛన్లను ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
Next Story

