Wed Apr 01 2026 10:03:11 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఈరోజు ఒకటో తేదీ కావడంతో ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీని వార్డు, గ్రామ సచివాలయం సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కలసి లబ్దిదారులకు అందచేస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62.60 లక్షల మందికి పింఛనుదారులకు రూ.2,724 కోట్లను విడుదల చేసింది
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా...
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా జరుగుతోంది. 22 నెలల్లోనే రూ.60,437 కోట్లను ప్రభుత్వం పింఛన్ల రూపంలో పేదలకు అందించింది. చంద్రబాబు నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల ఒకటోతేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 66 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
Next Story

