Sat Dec 13 2025 19:31:10 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నేడు పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. డిసెంబరు 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయింది. ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీని జరుగుతుంది. 63,25,999 మంది లబ్దిదారులకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. 2,738.71 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్ననే విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారుల ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రెండు రోజుల్లో పంపిణీకి...
పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజున పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. వితంతువులు, వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తుంది. అలాగే దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు, మంచానికే పరిమితమయిన వారికి పదిహేను వేల రూపాయలను నెలకు ఇవ్వనుంది. ఈ మేరకు ఉదయం నుంచి ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
Next Story

