Sat Mar 07 2026 19:35:33 GMT+0530 (India Standard Time)
Breaking : రేపు చంద్రబాబు వద్దకు పార్ధసారధి
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న పార్థసారధి పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. పెనమలూరు నుంచే తాను పోటీ చేస్తానని ఆయన తన క్యాడర్ కు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బోడే ప్రసాద్ మాత్రం...
అయితే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రేపు మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించనున్నారు. పెనమలూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన టీడీపీలో చేరతారని తెలిసింది.
Next Story

