Sat Dec 06 2025 03:01:40 GMT+0000 (Coordinated Universal Time)
TDP : పార్ధసారధి చేరికపై బోడే ప్రసాద్ ఏమన్నారంటే?
తెలుగుదేశం పార్టీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి పార్టీలో చేరికపై ఆయన కామెంట్స్ పార్టీలో చర్చకు దారి తీసింది. కొత్తగా పార్టీలోకి వచ్చే మిత్రులను ఆహ్వానిస్తామన్న బోడే ప్రసాద్, అయితే పనిచేసిన వారికి గౌరవం ఇవ్వాలని అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని....
పెత్తనం చేస్తే కార్యకర్తలు ఊరుకోరని కూడా బోడే ప్రసాద్ హెచ్చరించారు. కొంత మంది పార్టీలోకి వస్తున్నారని తెలిసిందని, అయితే అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం తనతో పాటు తన అనుచరులు కూడా పనిచేస్తారని చెప్పారు.
Next Story

