Thu Mar 19 2026 13:03:49 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేతలు దాడి చేస్తారని ముందే చెప్పా : బోడె ప్రసాద్
పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన తెలిపారు. వైసీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటిపైనా, పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నారని తాను ముందే చెప్పానని బోడె ప్రసాద్ తెలిపారు. తనకు కొడాలి నాని, వంశీలతో సంబంధాలుంటే ఆ విషయం ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.
వారితో తనకు....
నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం నువ్వు కోల్పోయావని వంశీకి తాను మెసేజ్ చేశానని బోడె ప్రసాద్ తెలిపారు. తనకు వైసీపీ నేతలతో ఎటువంటి సంబంధాలు లేవని, తనంటే గిట్టని వారు, తనకు సీటు రానివ్వకుండా చేయడం కోసం ఈ రకమైన దుష్ప్రచారానికి దిగుతున్నారని ఆయన అన్నారు.
Next Story

